
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- కల్వకుర్తి పట్టణంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్ లో రేపు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు, అదేవిధంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.