
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఇంటికి చేరాలి అని అధికారులకు సూచించారు. అయితే ఇందులో భాగంగానే ప్రతి మహిళ ప్రజా ప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా ఇద్దరమ్మ చీరలను ధరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చీరలను తయారు చేసే సంస్థ ఆరు నెలల్లో కేవలం 65 లక్షల చీరలు మాత్రమే తయారుచేసి ఇచ్చాయి అని.. కాబట్టి అందరికీ అందకపోవడంతో మొదటగా గ్రామాల్లోనే పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 65 లక్షల చీరలు పంచాలి అని తెలిపారు. ఇక 2026 మార్చి ఒకటి నుంచి 8వ తేది వరకు పట్టణాల్లో మిగతా 35 లక్షల చీరలు అందజేస్తామని అన్నారు. దీంతో మొత్తం కోటి చీరలు తెలంగాణ రాష్ట్ర మహిళలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందిరమ్మ చీరలను తీసుకోవాలి అని.. మహిళలను మా పార్టీ ఎప్పుడూ కూడా గౌరవంతో, మర్యాదలతో చూసుకుంటుంది అని వ్యాఖ్యానించారు.
Read also : IBOMMA రవికి కోర్టు ఏ శిక్ష విధిస్తుందో తెలుసా?
Read also : బయట ప్రపంచం ప్రమాదం అంటూ.. రెండేళ్ల పాటు బాలికను ఇంట్లోనే బంధించిన తల్లి! కారణం ఏంటంటే?





