తెలంగాణ

ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో కార్యాలయ స్థలంపై వివాదం

రెండు శాఖల మధ్య వాగ్వివాదం.. ఉద్రిక్తత

మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో కార్యాలయ స్థలాన్ని కేటాయించే అంశంపై రెండు ప్రభుత్వ శాఖల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎన్ఎస్పీ క్వార్టర్స్‌ను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

 

అయితే, అదే ప్రాంగణంలో ఇప్పటికే డివిజన్ కార్యాలయం కొనసాగుతుండటంతో క్వార్టర్స్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇవ్వలేమని ఎన్ఎస్పీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఖాళీ చేయాలని కోరుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా “క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలి” అంటూ సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, “ఇచ్చే ప్రసక్తే లేదు” అంటూ ఎన్ఎస్పీ సిబ్బంది పరస్పరం వాగ్వివాదానికి దిగారు.

 

కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఈ వ్యవహారంపై జిల్లా అధికారుల స్పష్టత రాకపోవడంతో సమస్య ఇంకా పరిష్కారం కాని స్థితిలోనే ఉంది. రెండు శాఖల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఎలా ముగుస్తుందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button