
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రాజమౌళి మరియు మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నటువంటి SSMB29 సినిమా నుంచి నిన్న ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్ లో విలన్ పృథ్వీరాజ్ సుకుమారాన్ వీల్ చైర్ లో కూర్చొని ఉన్నట్లుగా.. అతనే మెయిన్ విలన్ గా… ఏదో అనారోగ్య బారిన పడినట్లు.. బ్యాక్ డ్రాప్ లో అతనికి హీరో మీద కోపం ఉండవచ్చు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం పృద్వి సుకుమారన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ను చూసిన మహేష్ అభిమానులతో పాటు మరికొంతమంది రాజమౌళి పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ పోస్టర్.. గతంలో సూర్య నటించినటువంటి ’24’ అనే సినిమాలో ఇదే స్టైల్ లో సూర్య కుర్చీలో కూర్చొని ఉంటారు. కాబట్టి ఇది సూర్య సినిమాలో కాపీ చేసినట్లుగా ఉందని రాజమౌళిని ఏరిపారేస్తున్నారు. ఇది రాజమౌళి మార్క్ కాదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుంటూ పోతున్నారు. మరోవైపు సేమ్ జనరేటర్ పిక్ లా ఉందని.. మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ పోస్టర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : కేంద్రం గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు!
Read also : ఆదేశాలను వెంటనే అమలు చేయాలి.. లేదంటే చర్యలు తీసుకుంటాం!





