అంతర్జాతీయంవైరల్

పొరపాటున తప్పు నెంబర్లకు డబ్బులు పంపించారా?… టక్కున ఈ నెంబర్లకు కాల్ చేయండి మీ సమస్యను తీర్చుకోండి!

క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లో డబ్బులు పంపించడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. ఎవరిని డబ్బులు అడిగినా కూడా చేతిలో లేవు మొత్తం మొబైల్ అకౌంట్ లోనే ఉన్నాయి అని అంటూ చెప్పుకొస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్లలో మన భారత్ మొదటి స్థానంలో ఉందంటే మన ఇండియాలోని ప్రజలు ఈ ఫోన్ పే, గూగుల్ పే మరియు పేటీఎం అనే డిజిటల్ యాప్ లను ఎంతగా ఉపయోగిస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుత కాలంలో చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు కూడా ఆన్లైన్ లోనే పేమెంట్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లోనే చాలామంది కూడా పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు అనేవి పంపిస్తుంటారు. అలాంటప్పుడు చాలామంది కూడా అయ్యో అని.. తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఇప్పటి నుంచి ఇక ఆ కంగారు అలాగే భయం అనేది అవసరం లేదు. మీరు ఏ నెంబర్ కైతే డబ్బులు పంపించారో ఆ సమాచారం అంతటినీ కూడా స్క్రీన్ షాట్ తీయండి. వెంటనే ఈ కింద ఇచ్చిన నెంబర్లకు కాల్ చేసి మీ సమస్యలను వివరించండి.

Phone pay – 080687 27374
google pay – 1800 4190157
Paytm – 01204456456
BHIM – 18001201740

ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సమస్య గురించి వివరిస్తే… ఆ డబ్బును తిరిగి మీ అకౌంట్ కి వచ్చే చర్యలు వీరు తీసుకుంటారు. ఇక్కడ కూడా మీ డబ్బు గురించి ఎటువంటి స్పందన రాకపోతే మీరు వెంటనే NPCI అనే వెబ్సైట్లో కంప్లైంట్ ఇవ్వండి.

Read also : ఏపీలో పిడుగులతో కూడిన భయంకర వర్షం?

Read also : నేడే బీసీ రిజర్వేషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button