
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీ కందిపప్పు 120 రూపాయలకు పైగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాపుల్లో కందిపప్పును అందించాలని కోరిన కూడా అవ్వడం లేదు. రేషన్ షాపుల్లో కందిపప్పు ఈనెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులందరూ కూడా నిరాశ చెందుతున్నారు. కాగా కొంతకాలంగా రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా అనేది నిలిచిపోయింది. ఇకనుండి పండుగల సీజన్ కావడంతో ఇప్పుడైనా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇస్తారని లబ్ధిదారులు అందరూ కూడా భావించడం జరిగింది. కానీ షాపులకు వెళ్ళాక అసలు విషయం తెలుసుకొని మళ్లీ అసంతృప్తి చెందుతున్నారు. బయట మార్కెట్లలో కందిపప్పు రేట్లు ఎక్కువ పెరగడంతో రేషన్ షాపుల్లోనే ప్రభుత్వం కందిపప్పును తక్కువ ధరకు అందించాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు. కాగా ఇంతకుముందు రేషన్ షాపుల్లో కందిపప్పు తక్కువ రేట్ కి లభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార లభిస్తున్నాయి. మరి కొన్నిచోట్ల అరకొరగా పంపిణీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈసారి కూడా రేషన్ షాపులో కందిపప్పు సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారులు అందరూ కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Read also : తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు, ఏపీలో కూడా..
Read also: ఆ సినిమాలు చేస్తుందంటూ.. హీరోయిన్ పై కేసు!