Homeఅంతర్జాతీయంవరాహనది ఉత్తరవాహినికి పోటెత్తిన భక్తులు

వరాహనది ఉత్తరవాహినికి పోటెత్తిన భక్తులు

అనకాపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌:మహాశివరాత్రిని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో పవిత్ర ఉత్తర వాహిని తీరానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రి జాగరణ చేసిన భక్తులంతా సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు వరాహనది ఉత్తర వాహిని తీరానికి భారీగా తరలివచ్చారు. అనంతరం వారంతా బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

భక్తుల సౌకర్యార్థం శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం పుణ్యస్నానాలకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి స్వయంగా పాల్గొని భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు.

Most Popular

Recent Comments