క్రైమ్ మిర్రర్, దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో కురుస్తున్న బారీ వర్షాలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాల ప్రభావంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతూ, తక్కువ ప్రాంతాలు నీటమునిగిపోయాయి.
ప్రత్యేకంగా కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం చుట్టూ వరద నీరు చేరడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పాఠశాల సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భవనం చుట్టూ నీరు నిలిచిపోయింది.
Also Read:పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన… ఆశ్చర్యపోయిన బంధువులు
ఈ పరిస్థితుల్లో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైతే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడతామని తెలిపారు.
వాగు దాటే మార్గం పూర్తిగా మునిగిపోయింది. వర్షం ఇంకా కొనసాగితే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది అని. దేవరకొండ పట్టణం, కొమ్మేపల్లి గ్రామ పరిసరాలు మొత్తం వర్షజలాలతో నిండిపోవడంతో రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.
Also Read:షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు..!
Also read:గాయం కారణంగా ప్రతీకా అవుట్.. ఆమె ప్లేస్ లోకి కీలక ప్లేయర్?





