Homeక్రైమ్ఖమ్మంలో పేదల ఇండ్ల కూల్చివేత

ఖమ్మంలో పేదల ఇండ్ల కూల్చివేత

ఖమ్మం, క్రైమ్ మిర్ర‌ర్: ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ ప్రాంతంలో ఖమ్మం నగర శివారులో వెలగుమట్ల వినోబా నగర్ భూదాన్ భూముల్లో అధికారులు ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించారు. వెలుగుమట్లలోని 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వెళ్లారు. దీంతో అధికారుల‌కు, పేద‌ల మ‌ధ్య కొంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. జేసీబీల సహాయంతో గుడిసెలను తొలగించారు. పదేళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నాం తమకు పట్టాలు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు తగిన శాస్తి అయిందంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న త‌మ గూడును కూల్చివేయ‌డంతో పేద‌లు రోడ్డున‌ప‌డ్డామంటూ ఆవేద‌న‌వ్య‌క్తం చేశారు. కవరేజ్ కోసం వెళ్తున్న మీడియా ప్రతినిధులను సైతం పోలీసులు అడ్డుకోవ‌డం గ‌మ‌న‌ర్హం.

తాజావార్తలు