తెలంగాణ

చింతపల్లి పోలీసుల డబ్బుల దందా..!?..

  • బాధితుడికి ఫోన్ చేసి డబ్బులు కొట్టాలని డిమాండ్..
  • నోటికి వచ్చిన బూతులతో అడ్డమైన మాటలు..
  • జిల్లాలో స్థంభించిపోయిన పోలీసుల క్రమశిక్షణ..!?
  • లాఅండ్ఆర్డర్ కి నాణ్యత కరువు.. చింతపల్లి ఎస్ఐ, ఎస్బి ల నిర్లక్ష్యమంటూ ప్రజల మండిపాటు..!?
  • పోలీసుల తీరుతో ప్రజల్లో ఆదరణ కరువు.. గతంలో లేని విధంగా జిల్లా వ్యాప్తంగా అవినీతి దందా..!?

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్ ) :  పోలీసులు అంటేనే ప్రజల్లో ఎనలేని ఆదరణ, గౌరవం ఉంటుంది.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, మిగతా రాష్ట్రాల కన్నా బిన్నమనే చెప్పుకోవాలి.. అందులో నల్లగొండ జిల్లా ఉద్యమాలకు, పోరాటాలకు పెట్టింది పేరు.. ఒకప్పుడు నల్లగొండ పోలీసులు సైకిల్ మీద వెళ్తేనే బెంబేలెత్తిపోయే జనం, నేడు ఐదు వందలు ఇస్తే చాలు మూసుకుంటారనే స్థాయికి నల్లగొండ జిల్లా పోలీస్ వ్యవస్థ తయారైందని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు..!? దానికి కారణం జిల్లా బాస్ నిర్లక్ష్యమేనంటూ, ఇంతకు ముందులేని దొంగతనాలు, గంజాయి, సైబర్ నేరాలు, పిడిఎస్, వంటి ఎన్నో నేరాలతో జిల్లా మొత్తం కలుషితమయిందంటూ అనేక విమర్శలు వస్తున్నాయి..!?

ఒక్కప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్ల గురించి వార్తలు చదువుకునే ప్రజలు, నేడు ప్రతిరోజు నల్లగొండ జిల్లా పోలీసుల దుర్మార్గాల గురించి చదువుకునే పరిస్థితి వచ్చిందని అనుభవజ్ఞులు అంటున్నారు..!? జిల్లా పోలీస్ వ్యవస్థ మొత్తం గత కొద్ది నెలల నుండే బ్రష్టు పట్టిందని జనం అభిప్రాయపడుతున్నారు.. జిల్లాలోని చింతపల్లి మండలం అవినీతికి కేరాఫ్ అడ్రెస్స్ అనే చెప్పుకోవాలి..? హైవే మీద పోలీస్ స్టేషన్ ఉండటం, భూముల ధరలు ఆకాశానికి అంటడంతో, అందరి సంపాదనా చింతపల్లి వైపే పడిందని అనుకుంటున్నారు..!?

ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదురుకున్న చింతపల్లి పోలీస్ స్టేషన్ మరో అవినీతి మరకను బుట్టలో వేసుకుంది..? ఆరు నెలలు డ్యూటీ కూడా చెయ్యకుండానే ఎంతో మంది ఎస్ఐ లు అక్కడి నుండి, ఏదో ఒక కారణంతో బయటికి వెళ్లిపోతున్నారు..!? ఇది ఇలా ఉండగా చింతపల్లిలోని ఓ పోలీస్ అధికారి ఏకంగా బాధితుడికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చెయ్యటం, గలీజ్ మాటలతో బూతులు దండుకోవటం, మరోసారి పోలీస్ వ్యవస్థకి గొడ్డలి వేటుగా మారింది..!? తానేదో ప్రైవేట్ వ్యక్తిలా, చమటోర్చి తనేదో కష్టం చేసి, ఓ వ్యక్తిని ఆపద నుండి బయటపడేసినట్లు, ఆ పోలీస్ అధికారి సదరు బాధితుడిని బెదిరిస్తున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది..?మొదట బాధితుడు 500 ఇస్తాను సార్, అంటే తన కష్టానికి అది కూలీ కాదన్న విధంగా తిట్టడం, ఆ బాధితుడు హాస్పిటల్ లో ఉన్నానని చెప్పినా ముడ్డి నొస్తుందా.. గు_ నొస్తుందా అంటూ హేళన చేసి, డబ్బులు ఫోన్ ద్వారా కొట్టించుకోవటం పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తుందనే చెప్పుకోవాలి..!? మరి ఆ అధికారి ఆ డబ్బులు తనకోసమే అడిగాడా..? లేదా ఎస్ఐ అడగమంటే ఇలా అడుగుతున్నాడా..? అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..? ఎస్ఐ కనుసన్నలోనే ఈ దందా నడుస్తుందని, ఇలాంటివి గతంలో చాలానే జరిగాయని, అవన్నీ అక్కడ ఉన్న నిఘా అధికారి కలుపుకొని పోతాడంటూ అనేక విమర్శలు వస్తున్నాయి..? పోలీసులు తప్పు చేసారని అక్కడి ఎస్బి కి చెబితే, పోలీసులు అలా చెయ్యరు కధా అంటూ వారిని వెనకేసుకురావటం, వారికే వత్తాసు పలకడం, ఈ అవినీతికి ప్రధాన కారణమని అంటున్నారు స్థానికులు..!? ఏదేమైనా నిఘా అధికారి లోపం, ఎస్ఐ అలుసు వల్లే చింతపల్లి పోలీసులు ఇంతకు తెగిస్తున్నారంటు ప్రజలు అనుకుంటున్నారు..!?

చింతపల్లి ఎస్ఐ, ఎస్బి లు చేస్తున్న కార్యక్రమాలపై మరో క్రైమ్ మిర్రర్ కధనం ద్వారా మీ ముందుకు..

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..

Back to top button