
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు మరియు కాలేజీలకు నేడు దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్ర విద్యార్థులకు ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అంటే దాదాపు పది రోజులు దసరా సెలవులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. తిరిగి అక్టోబర్ మూడవ తేదీన స్కూల్స్ మరియు కాలేజెస్ రీ ఓపెన్ చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఈ పది రోజుల్లో దసరా సెలవులపై విద్యార్థి సంఘాలు కొన్ని డిమాండ్స్ చేస్తున్నాయి. దసరా పండుగా అక్టోబర్ రెండవ తేదీన రావడంతో.. పండుగ సందర్భంగా విద్యార్థులు బంధువుల ఇళ్లకు వెళ్లడము లేక ఏదో ఒక ప్రయాణాలకు వెళ్తుంటారు. అలాంటి విద్యార్థులు పండుగ మరుసటి రోజే బంధువుల ఇళ్ల నుంచి స్కూళ్లకు, కాలేజీలకు ఎలా హాజరు అవుతారని విద్యార్థి సంఘాలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అక్టోబర్ 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. అలా కుదరని చో.. అక్టోబర్ 3వ తేదీ అయిన సెలవు ఇవ్వాలని కోరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. ఏపీలో కూడా పండుగ తరువాత రెండు రోజులు సెలవులు ఇవ్వాలని విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ డిమాండ్లపై విద్యాశాఖ అధికారులు మరోసారి చర్చలు జరుపుతారో లేదో అనేది వేచి చూడాల్సిందే. దసరా పండుగ అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఘనంగా అమ్మవారి ఉత్సవాలను జరుపుతుంటారు. ఈ సందర్భంలోనే చాలామంది వాళ్ల బంధువుల ఇళ్లకు వెళ్లి పండుగలు జరుపుకుంటూ ఉంటారు.
Read also : పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన డిఐజి ఎల్ ఎస్ చౌహన్
Read also : గట్టుప్పల మండల అభివృద్ధిపై చర్చకు రావాలి