
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ న్యూస్ :- ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పై తాజాగా దాడి జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కేంద్రం సెక్యూరిటీని వెంటనే పెంచినట్లుగా తెలుస్తోంది. సీఎం రేఖ గుప్తాకు Z క్యాటగిరి సెక్యూరిటీతో పాటుగా ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్ద CRPF సిబ్బందిని కూడా మోహరించినట్లుగా సమాచారం అందింది. దాడి తర్వాత సీఎంను కలవడానికి చాలామంది వస్తుండడంతో.. వారిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ సెక్యూరిటీ తెగ కష్టపడుతున్నారు. ఆమెపై దాడి చేసినటువంటి రాజేష్ అనే వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
Read also : భారత్ తో విభేదాలు అమెరికాకు నష్టమే, నిక్కీహేలీ షాకింగ్ కామెంట్స్!
మరోవైపు తనపై జరిగినటువంటి దాడి విషయం గురించి సీఎం రేఖ గుప్తా వెంటనే స్పందించారు. దాడి జరిగిన వెంటనే షాక్ కు గురయ్యానని చెప్పుకొచ్చారు. ఢిల్లీకి సేవ చేయాలనే నా సంకల్పంపై జరిగిన ఇది ఒక పిరికిపంద చర్య అని అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే నా స్ఫూర్తిని ఇలాంటి దాడులు వల్ల ఎవరూ కూడా ఆపలేరు అని స్పష్టం చేశారు. ఈ దాడి వల్ల నేనేం కృంగిపోనని.. ఎప్పటిలాగానే ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం ఇవన్నీ కూడా మునుపటి లాగానే కొనసాగుతూ ఉంటాయని అన్నారు. ప్రజల మద్దతే నాకు కొండంత బలమని సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. కాగా దాడి చేసిన రాజేష్ కుక్కల ప్రేమికుడు అని… సుప్రీంకోర్టు తీర్పుతో ఆవేదన చెందిన రాజేష్ ఢిల్లీకి వెళ్లి సీఎంను ప్రశ్నించేందుకు వెళ్లి అనుకోకుండా దాడి చేశాడని ఆమె తల్లి చెప్పింది. రాజేష్ మానసిక పరిస్థితి అంతగా బాగాలేదని అతని తల్లి వీడియో వేదికగా తెలిపారు.
Read also : భారత అమ్ములపొదిలోకి మరో అణ్వస్త్రం, అగ్ని 5 పరీక్ష విజయం