తెలంగాణ

మిర్యాలగూడ జర్నలిస్టుల దశాబ్దాల కల సహకారం

మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- దశాబ్ద కాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న మిర్యాలగూడ జర్నలిస్టుల కల ఈరోజు నిజమైంది. ఫ్లోర్ లీడర్‌గా ఇచ్చిన మాటను ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటూ, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) విలేకరుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలోనే ప్రత్యేకంగా, మిర్యాలగూడలో 88 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, స్థానిక సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పాల్గొన్నారు.

Read also : చేవెళ్లలోని ఫామ్ హౌస్ లో ఫారిన్ వ్యక్తుల బర్త్ డే పార్టీ భగ్నం

ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ..జర్నలిస్టుల అభివృద్ధి కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సబ్ కలెక్టర్లను అభినందిస్తున్నాను. విలేకరులకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాం అని తెలిపారు.ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ..ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో నేను ఫ్లోర్ లీడర్‌గా ఉన్నప్పుడు మాటిచ్చాను, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల కట్టుబడి ఉంది. ఇంకా ప్లాట్లు అందని వారికి త్వరలోనే న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిర్యాలగూడలో విలేకరులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. ఇదే చొరవతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, అన్ని సౌకర్యాలతో జర్నలిస్టు కాలనీని అభివృద్ధి చేస్తాం అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు మాట తప్పినా, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టింది. ఈ ప్రయత్నంలో బీఎల్ఆర్, సబ్ కలెక్టర్ అమిత్ కృషి ప్రశంసనీయం” అని తెలిపారు.

Read also : మనదేశ భవిష్యత్తు మన బాలలపైనే ఉంది : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button