
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆటలా మారిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రేమించడం మొదలు పెట్టేసారు. అయితే ఈ ప్రేమను వివిధ కారణాల ద్వారా అబ్బాయి లేదా అమ్మాయి ఇంట్లోని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం వంటి వార్తలు ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో కొన్ని డజన్ల కొద్ది చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం.. అబ్బాయి ఇంటిని కూల్చివేసింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా, ఝరాసంఘం , కక్కరవాడలో ఉన్నటువంటి విట్టల్ కూతురు అదే గ్రామానికి చెందినటువంటి బోయిన నాగేష్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే వీళ్ళిద్దరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి నేరుగా వెళ్లి ఆ అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి అమ్మాయి తండ్రి విటల్ తన కొడుకుతో కలిసి అబ్బాయి తండ్రిపై ఘోరంగా దాడి చేయడమే కాకుండా ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడే ఉన్నటువంటి స్థానికులు అందరూ చూస్తూనే ఉండిపోయారు.
Read also : సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!
Read also : తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు!.. IMD కీలక ప్రకటన
				
					
						




