
క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్ :- ఈ మధ్యకాలంలో లంచం అనేది అధికారులకు చాలా అలవాటుగా మారిపోయింది. దేశంలో అన్ని రంగాలలో కొద్దో గొప్ప మార్పులు వస్తున్నా కానీ లంచం విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు రావడం లేదు. ప్రస్తుత సిస్టంలో ఉన్నటువంటి కరప్షన్ పై సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన వల్ల ప్రతి ఒక్క అధికారిపై సామాన్యులు మండిపడుతున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే… బెంగళూరుకు చెందినటువంటి BPCL మాజీ సిఎఫ్ఓ శివకుమార్ కూతురు ఇటీవల కొన్ని అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. మృతి చెందిన తరువాత కొన్ని కీలక విషయాలను సోషల్ మీడియాలో ఆమె తండ్రి శివకుమార్ పంచుకున్నారు. తమ కూతురు చనిపోయిన బాధలో ఉంటే.. చనిపోయిన తరువాత అంబులెన్స్ మొదలుకొని డెత్ సర్టిఫికెట్ తీసుకునేంతవరకు కూడా ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వలేక మనోవేదనకు గురయ్యానని చెప్పుకొచ్చారు. తన కూతురు చనిపోయిన తర్వాత FIR, పోస్టుమార్టం రిపోర్ట్, అంత్యక్రియలు.. చివరికి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేశారు. అయితే అతను డిలీట్ చేయబోయే లోపే చాలా మందికి ఈ విషయం సోషల్ మీడియా వేదికగా రీచ్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలోని కరప్షన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. బ్రతికున్నప్పుడు పట్టించుకోని అధికారులు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కదానికోసం లంచం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని సామాన్య ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఈ లంచాల సమస్య వదిలితే కానీ దేశం బాగుపడదు అని.. లేదంటే అప్పటివరకు ఈ దేశం ఇలానే తగలడుతుంది అని చాలామంది లంచం తీసుకునేటువంటి అధికారులపై మండిపడుతున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇలా మళ్లీ లంచాలు తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలి అని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.లేదంటే లంచగొండులు మరింత మంది పుట్టకొస్తూనే ఉంటారూ అని… ఠాగూర్ సినిమా లో చిరంజీవి చెప్పినట్లు జరుగుతుంది అని అంటున్నారు.
Read also : తగ్గిన తుఫాన్ ప్రభావం.. మరి రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారా?
Read also : అసలైన అవినీతి యువరాజులు వీరే : ప్రధాని మోదీ





