-
ఏడాది తర్వాత బయట పడిన దారుణం..!
-
తల్లి మృతదేహాన్ని ఇంట్లో బెడ్రూమ్లో పూడ్చిపెట్టి కుమార్తె
-
ప్రియుడితో కలిసి కుమార్తె తన తల్లిని చంపిన ఉదంతం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది తర్వాత వెలుగు చూసిన ఈ దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోని బెడ్రూమ్లోనే పూడ్చిపెట్టి, పైన సిమెంట్, ఇసుకతో కాంక్రీట్ వేసి కప్పిపెట్టారు. జవహర్‌నగర్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్లో నివసించే అంజు (40) అనే మహిళ 2025 మే నుంచి కనిపించకుండా పోయింది. తన ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుపడుతోందన్న కారణంతో చిన్న కుమార్తె ఇషిక, తన ప్రియుడు మాంటీ రాజ్‌తో కలిసి ఈ హత్యకు పాల్పడింది.
మే 12, 2025న మాంటీ రాజ్ బాధితురాలిని కత్తితో పొడవగా, ఇషిక అతనికి సహకరించింది. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోని బెడ్రూమ్లోనే పూడ్చిపెట్టి, పైన సిమెంట్, ఇసుకతో కాంక్రీట్ వేసి కప్పిపెట్టారు. ఇషిక స్వయంగా తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఏడాది పాటు ఏమీ తెలియనట్లు నటించింది. అయితే, తల్లి పేరు మీద ఉన్న ద్విచక్ర వాహనాన్ని మాంటీ రాజ్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి విచారించడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితుడు మాంటీ రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తుంది, మైనర్ అయిన ఇషికను జువైనల్ హోమ్‌కు పంపారు. పోలీసులు ఇంటి నుంచి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
