
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- స్టార్ హీరో ధనుష్ మరియు హీరోయిన్ మృనాల్ ఠాకూర్ మధ్య ఏదో సంబంధం ఉంది అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీరిద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నట్లు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మృనాల్ ఠాకూర్ నటించిన “దో దివానే షహర్ మే” అనే సినిమా మూవీ టీజర్ ను తన ఇన్స్టా వేదికగా మృనాల్ ఠాకూర్ అప్లోడ్ చేయగా.. ఆ టీజర్ కింద కామెంట్ రూపంలో హీరో ధనుష్ ‘చాలా బాగుంది’ అనే అర్థంతో కామెంట్ చేశారు. దీనికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా లవ్ సింబల్ తో తన కామెంట్ కు రిప్లై ఇవ్వడంతో వీటిని చూసిన వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్లను హైలెట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య తెలియని బంధం ఉందనడానికి ఇదే ఆధారమని కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ధనుస్ తో డేటింగ్ చేస్తున్నారా అని మృనాల్ ఠాకూర్ ను కొంతమంది ప్రశ్నించగా.. దానిని ఆమె ఖండించారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కూడా ఇలానే డేటింగ్ చేసుకుంటూ.. ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ రాగా చివరికి పెళ్లి చేసుకుంటున్నామని ఒక నిర్ణయానికైతే వచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే మృనాల ఠాగూర్ మరియు ధనుష్ మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేది త్వరలోనే బయటకు రానుంది.
Read also : ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ప్రజలు!
Read also : సౌత్ ఆఫ్రికా తో భారత్ ఢీ.. కెప్టెన్, జట్టు పూర్తి వివరాలు ఇవే!





