
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
ప్రపంచవ్యాప్తంగా భారీ తుఫాన్లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రకృతి విపత్తుల కారణంగా ఎంతో మంది మరణించిన వార్తలు చూస్తూనే ఉన్నాము. అయితే తాజాగా తుఫాన్ల విధ్వంసానికి వేగంగా మూడు దేశాలలో ప్రజలు వణికి పోతున్నారు. ఇక తాజాగా వరదలు అలాగే కొండ చర్యలు విరిగిపడి మూడు దేశాలలో ఏకంగా 1100 మందికి పైగా మృతి చెందారు అంటే దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియా, శ్రీలంక మరియు థాయిలాండ్ దేశాలలో వరదల బీభత్సానికి అలాగే కొండ చర్యలు విరిగిపడిన సందర్భంగా 1100 మందికి పైగా మృతి చనిపోయారు. ఇండోనేషియాలో 505, శ్రీలంకలో 334, థాయిలాండ్ లో 267 మంది తాజాగా వచ్చినటువంటి తుఫానుల విధ్వంసంలో మృతి చెందారు. ఇక ఈ మూడు దేశాల్లోనే వేల మందికి పైగా గల్లంతు కాగా కొన్ని లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. ఇక మన భారతదేశంలో తుఫాన్లు మరియు వరదల కారణంగా 6 మంది చనిపోయారు. ఇప్పటికే మన పక్క దేశమైనటువంటి శ్రీలంకలో మన ఇండియన్ సురక్ష బృందాలు వరదలలో చిక్కుకున్నటువంటి వారిని సురక్షితంగా కాపాడుతున్నారు. దాదాపు 144 మంది వరదల్లో చిక్కుకున్న మనుషులను ఇండియన్ NDRF బృందాలు కాపాడి తీసుకువచ్చినట్లుగా భారత హై కమిషన్ వెల్లడించింది. దీంతో కేవలం తుఫానుల యుద్ధం కారణంగానే కొన్ని వందల మంది ప్రజలు చనిపోతున్నారు.
Read also : డైరెక్టర్ తో సమంత పెళ్లి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్!
Read also : ఒక హిడ్మా ను చంపితే 1000 మంది, ఒక ఐ బొమ్మ రవిని చంపితే 100 మంది పుట్టుకొస్తారు : CPI నారాయణ





