
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించినటువంటి మొంథా తుఫాన్ ప్రస్తుతం శాంతించింది అని చెప్పాలి. ఇవ్వాళ తెల్లవారుజాము వరకు కూడా తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా దంచి కొట్టాయి. అయితే ఆ తరువాత మెల్లిగా బలహీనపడుతూ వచ్చింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు చతిస్గడ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఏపీలోని కోస్తా ఆంధ్రాలో భారీ వర్ష సూచన ఇంకా ఉంది అని స్పష్టం చేశారు. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానిదే అని తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కేవలం ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి పంట నష్టాల గురించి అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతూ వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా గుర్తించామని అధికారికంగా సమాచారం అందించారు.
Read also : తెలంగాణ కేబినెట్‌లో అజారుద్దీన్‌కి మంత్రి పదవి..!
Read also : తుఫాన్ ఎఫెక్ట్… సీఎం కీలక నిర్ణయం!





