Saturday, March 21, 2026
Homeసినిమాసినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం జెన్యూన్ హీరోలు లేరు : తాప్సీ

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం జెన్యూన్ హీరోలు లేరు : తాప్సీ

• ఇండస్ట్రీలో జన్యున్ హీరోలు లేరు
• హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ తాప్సి

క్రైమ్ మిర్రర్,సినిమా:- ఈ మధ్యకాలంలో మన దేశ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని మాత్రం థియేటర్ల వద్ద భారీగా నష్టాన్ని కూడా చవిచూశాయి. కానీ ప్రస్తుత రోజుల్లో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతున్న.. వాటిల్లో ప్రజలకు దగ్గర అయ్యేటువంటి స్టోరీలు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఒకప్పటి కాలంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి అంటే దానికి ప్రధాన కారణం సినిమాలోని కథ. కానీ నేడు వచ్చేటువంటి సినిమాలలో హీరోలు సైతం హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటే చేయడం లేదు అని తాజాగా హీరోయిన్ తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కథకు ప్రాధాన్యమిచ్చి తన పాత్ర కొద్దిగా ఉన్నా సరే చేయడానికి హీరోలు ఒప్పుకోవడం లేదు అని అన్నారు. హీరోల పాత్ర కొంతమేరకు ఉన్న నటించేటువంటి జెన్యూన్ హీరోలు లేరు అని తాప్సి అన్నారు. ఎలాగైనా సరే సినిమాలో హీరోనే హైలైట్ అవ్వాలి అని.. అలా అయితేనే పెద్ద సినిమాల ఆఫర్లు వస్తాయి అనే కోణంలో హీరోలు ఉన్నారు అని హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల హీరోలు అంతే ఉన్నారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఇలా అయితే ఇండస్ట్రీలో మంచి స్టోరీ ఉన్నటువంటి సినిమాలు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రతి హీరో కూడా తను హైలెట్ అవడం కాకుండా సినిమా స్టోరీ బాగుంటే చేయాలి అని కోరారు.

రంజాన్ వేల ఏపీలో గ్యాస్ కొరత..!

YSRCP Strategy: వైసిపి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్, పాత సన్నిహితుడినే ఆశ్రయించిన జగన్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments