తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ AEE నిఖేష్ కుమార్ అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇతను చేసినటువంటి అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన గురించి అన్ని విషయాలు రాబట్టిన పోలీసులు చెప్పిన విషయాలు తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
రెడ్ లైట్ ఏరియా గా మారిపోయిన ఎల్బీనగర్!..జర భద్రం?
నీటిపారుదల శాఖ AEE నిఖేష్ కుమార్ రోజుకు 2 లక్షల పైగానే అక్రమంగా సంపాదిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇక జాబ్లో చేరిన 10 సంవత్సరాలలోనే 100 కోట్లు సంపాదించాడట . దాదాపుగా ఒక్కొక్క ఫైల్ కే ఆయన 50 లక్షలు వరకు లంచం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. FTL మరియు బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన ఏకంగా చాలా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా చాలా మంది ఉన్నట్లుగా మీడియాలు సమాచారం అందించాయి.
మణికొండకు బుల్డోజర్లు.. రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్
ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరిట ఎన్నో భవనాలను కూడా కూల్చేసిన విషయం మనందరికీ తెలిసింది. అవన్నీ కూడా అప్పట్లో అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరో కూడా ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. కాగా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక లంచాల పేరిట ఎంతోమంది బయటకు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా లంచాలు తీసుకోవడం మానేయాలని పోలీసులు ఎన్నో విధాలుగా చర్చోప చర్చలు అలాగే వార్నింగులు ఇచ్చిన కూడా ఇలాంటివి ఆగట్లేదు.
ఇరిగేషన్ ఏఈ ఆస్తి రూ. 600 కోట్లు.. నోట్ల కట్టలు చూసి షాకైన ఏసీబీ