
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- సంక్రాంతి పండుగ సందర్భంగా, మండలంలోని ఖుదాబాక్స్ పల్లి గ్రామంలో, పిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో, కేపీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో ఫైనల్ విజేతగా కేబిపీ బెస్ట్ బడ్డీస్ గెలుపొందారు. ఈ ఒక్క టీం 2024 లో విజేతగా, 2025 లో సెమి ఫైనలిస్ట్, 2026లో మళ్లీ విజేతగా నిలిచారు. ఈ టోర్నమెంట్ నిర్వహించిన గ్రామసర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు గౌడ్, విజేతలకు షీల్డ్ నగదు బహుమతిని అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ షబ్బీర్, వార్డ్ మెంబర్లు అరగంటి అరుణ, వెంకటేష్, నర్సింగ్ గణేష్, మహమ్మద్ అక్రంబీ జావిద్, చింతల రామేశ్వరీ నిరంజన్, పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, నీల భాస్కర్, నాగరాజు, జంగయ్య, వెంకటేష్, లింగం, మొదటి విజేత టీం సుభాష్, గిరేష్, లింగస్వామి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఒక చేతిలో మాతృత్వం… మరో చేతిలో కర్తవ్యం
BMC Elections: ఫైవ్‌స్టార్ హోటల్‌కు షిండే కార్పొరేటర్లు, మేయర్ పదవి కోసం పట్టు!





