
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- బంగ్లాదేశ్ లో ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ యూనస్ స్పందించారు. మా దేశంలో హిందువులపై ఎటువంటి హింస గాని లేదా దాడులు కానీ జరగలేదు అని… సోషల్ మీడియా వేదికగా మాపై చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అన్నీ కూడా ఇండియా సృష్టించినటువంటి ఫేక్ వార్తలు అని తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో ఫేక్ న్యూస్ లు సృష్టించడం చాలా సులభమని.. భారతదేశం యొక్క స్పెషాలిటీస్ లో ఫేక్ న్యూస్ కూడా ఒకటి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సరిహద్దులు మరియు ఇతర స్థానిక సమస్యల విషయంలో ఇరుగు అలాగే పొరుగు దేశాల మధ్య విభేదాలు అనేవి సర్వసాధారణమని అన్నారు. ప్రతి ఒక్క దానికి కూడా మతం రంగు పూయకూడదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగాయని వస్తున్న వార్తలు అన్నీ కూడా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇలాంటి విషయంలో తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటుంది అని తెలియజేశారు. అయితే మన ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య స్వల్ప విభేదాలు మెల్లిగా మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై హింస జరుగుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ యూనస్ ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : ఈ ‘బండి’ మనకు అవసరమా.. కూకట్ పల్లి కాంగ్రెస్‌లో రచ్చ
Read also : తిరుగులేని రికార్డులకు చేరువలో రోహిత్ శర్మ?