
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రశ్నించడానికి పుట్టాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే తీరా ప్రస్తుతం గుళ్ళు గోపురాలు అంటూ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆదానికి దోచిపెడుతుంటే పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ అలా అన్ని రాష్ట్రాల గుళ్ళు, గోపురాలు తిరగడం తప్పని అన్నారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉండి పాలన చేయకుండా కాషాయ దుస్తులు ధరించి రాజకీయాలు, లడ్డూలో కల్తీ పేరుతో మౌన దీక్షలు చేస్తా అని అనడం మంచి పద్ధతి కాదని తెలిపారు. కాషాయ దుస్తులు ధరించి అలా అన్ని దేవాలయాలు తిరుగుతూ ఉంటే ఇక నీకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అని ప్రశ్నించారు.
కలెక్షన్లలో రికార్డు సృష్టించిన తండేల్ మూవీ!..
మరోవైపు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన పాలను తాను చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎలక్షన్ల సమయంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించింది, మీరు అభివృద్ధి చేస్తారని తప్ప ఇలా రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తారని కాదని అన్నారు. మీకు అంతగా గుళ్ళు, గోపురాలు తిరగాలని అనుకుంటే దేవాదాయ శాఖ ను తీసుకొని ఏ రాష్ట్రంలోని దేవాలయాల కైనా ఇష్టమొచ్చినట్లుగా తిరగొచ్చని అన్నారు. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేవారు కూడా ఎవరూ ఉండరని అన్నారు.
మహా కుంభమేళాలో రౌడీ బాయ్!.. విజయ్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు విలువ ఎంత మీకు తెలుసా!..