
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- రైతు పంటతో సాహసం చేసి నిరంతరం శ్రమించి సాగు చేసిన పంటకు ఒకవైపు ఎరువుల కొరత, మరోవైపు సకాలంలో వర్షాలు లేక పంట సగానికి పైగా దిగుబడి తగ్గిపోయిందని గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్లికంటి రాఘవేందర్ అన్నారు.
ఈ సంవత్సరం ఎన్నడు లేనివిధంగా ఎర్ర నల్లి వైరస్ ల బారినపడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట చేతికి అందిన తరవాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారుల చేతుల్లో అమ్ముకోవాల్సిన పరిస్తితి దాపురించిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా పత్తి కొనుగోలు చేయాలని కోరారు.
Read also : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం!
read also : కట్టడాలను తొలగించకుండా కాపు కాస్తుంది ఎవరు..?