
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అని.. మీ బాగోగులు చూసుకునే బాధ్యత మాది అని చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని హిందువులకు గౌరవం లేదా?.. అని ప్రశ్నించారు. మీరు ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే మరి హిందువుల ఆత్మగౌరవాన్ని కాల రాసినట్లే కదా?.. అని ఆగ్రహించారు. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను అలాగే అబద్దాలను బలంగా ఢీ కొట్టాలి అని.. వారికి జవాబు చెప్పే ధైర్యం లేకుండానే చేయాల్సినటువంటి బాధ్యత మన హిందువులదే అని తెలిపారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయో అని ప్రతి ఒక్కరు కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులను అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకుంది అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. అయోధ్య రామాలయం నిర్మించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుంది అని.. ఆ తరువాత మన భారతీయ జనతా పార్టీ వల్లనే రామాలయం నిర్మాణం పూర్తయి ప్రస్తుతం కొన్ని కోట్ల మంది హిందువులు రాముడిని దర్శించుకుంటున్నారు అని తెలిపారు.
Read also : ఫ్రెండ్ డబ్బుతో లాటరీ కొన్నాడు.. 11 కోట్ల గెలిచాడు.. చివరిలో ట్విస్ట్ సూపర్ భయ్యా?
Read also : సారా తాగితే సరసానికి పనికిరాడు.. వోడ్కా వల్ల గవదులు వాచిపోతాయి!





