
-
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..
-
లబ్ధిదారులతో దరఖాస్తులు స్వీకరిస్తాం..
-
దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కు అందజేస్తాం..
-
బిజేపి ఆద్వర్యంలో బిజెపి పోరుబాట…
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మోసపూరిత హామీలను నెరవేర్చలేని బీజేపీ పార్టీ పోరుబాట చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో బిజెపి మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ కో కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారం కోసం చేయూత పథకము ద్వారా పెన్షన్ ప్రతి నెలకు రూ 2000 నుండి రూ 4000 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు నెరవేర్చ లేదని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి గృహిణికి ప్రతి నెల రూ 2500/- అందజేస్తామని ప్రజలకు శాసనసభ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో లబ్ధిదారులతో నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతరం గ్రామ బిజెపి నాయకులు బొబ్బల మురళీమనోహర్ రెడ్డి, నకిరేకంటి లింగస్వామి గౌడ్, పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలు ఒత్తిడి చేసేందుకే బిజెపి పోరాటం చేస్తుందని, ఆరు గ్యారెంటిలో ప్రధానమైన చేయూత, మహాలక్ష్మి పథకాలను ఏడాది కాలం గడిచిపోయినా అమలు చేయలేదని తక్షణమే వాటిని అమలు చేయాలనీ లబ్ధిదారులతో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
బిజేపి నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
బిజేపి నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి
బిజేపి నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు


బిజేపి నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి

బిజేపి నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు
దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ని కలిసి అందజేస్తామని అన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని అమలు చేయకకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలనీ లేనియెడల రాబోయే రోజుల్లో బిజెపి ఆధ్వరంలో ఉద్యమం చేపడతామిని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చండూర్ మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, పంచాయతీ మాజీ కోఆప్షన్ సభ్యులు పిన్నింటి వెంకట్ రెడ్డి, బూత్ అధ్యక్షులు దశరథ గౌడ్, పోలే సురేష్, బిజెపి నాయకులు బొబ్బల జనార్దన్ రెడ్డి, ఇరిగి శివ, రఘు గౌడ్, మహేందర్ రెడ్డి, శ్రీశైలం, కిరణ్ కుమార్ రెడ్డి, ముక్కాముల సైదులు, జాజుల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు