తెలంగాణ

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా

క్రైమ్ మిర్రర్, జగిత్యాల :  కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల – జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయం 7గంటలకు బండి పై ఇంటికి వెళ్తున్న మారు గంగారెడ్డి(53)ని కారు తో గుద్ది కింద పడ్డాక కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.  గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు స్థానికులు చెప్పారు. గంగారెడ్డి హత్య విషయం తెలియడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హత్య చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సొంత సోదరడు గా భావించే జాప్తాపూర్ గ్రామానికి చెందిన మారు గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు గురి కావడం పట్టణం ఒకసారి ఉలిక్కిపడేలా చేసింది.

జగిత్యాలలో బిఆర్ఎస్ రాజ్యము నడుస్తుందా కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు.కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో BRS రాజ్యమే నడుస్తుందని అన్నారు. హత్యకు నిరసనగా జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సహా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు

Back to top button