మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జిన్నారెడ్డి.. అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం

క్రైమ్ మిర్రర్, నేరేడుచర్ల:- మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని, మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిన్నా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా మున్సిపాలిటీలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పుర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డు అభ్యర్దులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read also :

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అభినవ్

న్యాయవాది స్వప్న హత్య కేసులో బిగ్ బిగ్ ట్విస్ట్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button