
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కేసిఆర్ దాదాపు చాలా రోజుల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రతిపక్ష పార్టీ అలాగే కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటినుంచి ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క తాటతీస్తాం అంటూ కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఒక కార్యక్రమంలో భాగంగా చాలా రోజుల తర్వాత కెసిఆర్ చాలానే విషయాలను మాట్లాడారు. అయితే ఈ విషయాలపై తాజాగా కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క లాంటి కొంతమంది సీనియర్ నాయకులు స్పందించగా నేడు మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ కౌంటర్లు వేస్తున్నారు.
Read also : జనవరి నెలలో సగానికి పైగా సెలవులు.. ఎలా అంటే?
కెసిఆర్ తమ ఉనికిని కాపాడుకునేందుకే తనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఫైర్ అయ్యారు. కెసిఆర్ 10 ఏళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు. మళ్లీ తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ మీకు ఓట్లు పడలేదు అని అన్నారు. ఇలా ఎవరు తప్పు చేసినా వారి తోలు తీసే బాధ్యత ప్రజలు తీసుకుంటారు అని మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు. గత పది ఏళ్ల కాలంలో మీ పాలనతో కలిగిన ఇబ్బందులను మేము సరి చేస్తున్నాము అని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు ఎవడైనా సరే అసెంబ్లీకి వచ్చి చర్చలు చేయాలి అని కోరుతున్నామని గాంధీభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇదే స్థాయిలో కెసిఆర్ పై విరుచుకుపడ్డారు.
Read also : అంబరానంటిన సర్పంచ్ సంతోష్ యాదవ్ సంబరాలు..!





