
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు, పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు రెండు రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడంతో తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే దేశం ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలపై మరింత భారం ఎందుకు వేస్తున్నారని బిజెపి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని… కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరింది. అయితే తాజాగా ముడి చెమురు ద్వారా నాలుగేళ్ల కనిష్టానికి చేరింది. కానీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేకపోతుందని… తగ్గించడం పక్కన పెడితే ఎందుకు పెంచారని కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి పై తీవ్రంగా విమర్శలను గుప్పించింది. ఇంత చేసినా కూడా ప్రజలపై ఎటువంటి భారం పడదని మళ్లీ తీర్పునెలా ఇస్తారని ట్విట్ చేసింది. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ముడి చెమురుల ధరలు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ అలాగే వంట గ్యాస్ అనేవి రోజువారి నిత్యవసరాలు కనుక ప్రజలు కూడా ఇవి కొనాలంటే భయపడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలను వెంటనే తగ్గించాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ధరలు తగ్గించడం చేతకాకపోతే వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులు రోడ్లమీద ర్యాలీలు నిర్వహిస్తూ వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.