క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రైతు భరోసా పంపిణీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ.. గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రివర్గ సభ్యులు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంతమేర భూమికి ఇవ్వాలి.. ఈ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలి.. అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. అలాగే.. రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్
- మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తల్లిదండ్రులతో కలసి విద్యార్థినిల ఆందోళన
- వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
- ప్రారంభమైన టెట్ పరీక్షలు.. 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష
- పేదలకు గుడ్ న్యూస్… ఒక్కొక్కరికి ఆరు కిలోలు సన్న బియ్యం!!