Homeక్రైమ్కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప‌ర‌స్ప‌ర రాళ్ల‌దాడి

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప‌ర‌స్ప‌ర రాళ్ల‌దాడి

  • ఒక‌రికి తీవ్ర గాయాలు

మంచిర్యాల , క్రైమ్ మిర్ర‌ర్ః మంచిర్యాల జిల్లా క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటిలో పాల‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీఆర్ ఎస్‌, సీపీఐ, కాంగ్రెస్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌లు చెల‌రేగ‌గా ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో మంద‌మ‌ర్రి ఏరియాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయ‌కుడు జావీద్ ఖాన్‌కు రాయి తాక‌డంతో తీవ్ర గాయ‌మైంది. వెంట‌నే పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఇరువ‌ర్గాల‌ను శాంతింప చేశారు. గాయ‌ప‌డ్డ జావీద్‌ఖాన్‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న ఎంపీ గ‌డ్డం వంశీక్రిష్ణ జావీద్‌ఖాన్‌ను ప‌రామ‌ర్శించారు.

 

Most Popular

Recent Comments