గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోంది. పాత, కొత్త నేతల మధ్య వార్ సాగుతోంది. పదవుల విషయంలో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుందనే చర్చ సాగుతోంది. యూత్ కాంగ్రెస్ పదవుల విషయంలో బీసీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి కొందరిని సస్పెండ్ చేయడం దుమారం రేపుతోంది. ముఖ్యంగా బీసీ, మైనార్టీ నేతలపై యాక్షన్ తీసుకోవడాన్ని బీసీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఓబీసీ సీనియర్ నేత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే తాట తీస్తామని హెచ్చరించారు.
యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్. గతంలో దానం నాగేందర్ దళితులను, మైనారిటీలను అంటే పంచలుడదీసి డ్రాయర్ కూడా లేకుండా కొట్టామని చెప్పారుయ గతంలో కేరళ ఇంచార్జి వస్తే పెండతోని, గుడ్లతోని, టమాటాలతొని కొట్టినమని గుర్తు చేశారు. శివ చరణ్ రెడ్డి దళితులను, మైనారిటీలను సస్పెండ్ చేయకు.. ఆ పరిస్థితులు తెచ్చుకోకు అని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ, మైనార్టీ నేతల వల్లే హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉందని చెప్పారు.