
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో ఉగ్రవాద దాడి చేయడం ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షులు నికోల మధురోను ఆయన భార్యని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. గురువారం రోజున డాక్టరు బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కూరెళ్ల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచశాంతి కాముకుడిగా గొప్పలు చెప్పుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ పక్క దేశాలపై బాంబు దాడులకు పాల్పడడం సిగ్గుచేటు అని, అమెరికా సామ్రాజ దురాక్రమణను ఖండించాలని అన్నారు.
Read also : ఆచూకీ లేని సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్.. వారంలో ఒకటి రెండు రోజులే హాజరు?
వెనిజులా చుట్టూ తన సైనిక నావికాదళాలను అమెరికా మోహరించిందని అన్నారు. స్వతంత్ర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రజల తీర్పును కాలా రాసే ప్రభుత్వాలను కులదోసె కుట్రలు చేయడం అమెరికా సామ్రాజ్యవాదానికి అలవాటుగా మారిందని , వెనిజులా సహజ వనరులపై కన్నేసి అమెరికా, అక్కడి ప్రజల ఆత్మ గౌరవాన్ని, స్వయం నిర్ణయ హక్కులను తుంగలో తొక్కుతూ దౌర్జన్య చర్యలకు పాల్పడుతుందని, పశ్చిమార్ధగోళంలో అమెరికా దళాల కేంద్రీకరణ, మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలని ఉద్దేశాన్ని ట్రంపు ప్రకటించడం పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అని అన్నారు. అమెరికా దురాక్రమాలను వెంటనే ముగించాలని, వెనిజులా దేశ అధ్యక్షుడు మధురో ఆయన సతీమణి సిలియను వెంటనే నిర్బంధం నుంచి విడిచి పెట్టాలని, ప్రపంచ ప్రజలకు అమెరికా సామ్రాజవాదం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం,గ్రామ కార్యదర్శి తుమ్మలగూడెం యాదయ్య,సిపిఎం సీనియర్ నాయకులు భాష బోయిన రాములు,మరిపెళ్లి మల్లయ్య, భాషబోయిన బుగ్గయ్య,బండ బీరయ్య,అంబోజు వెంకటయ్య, బండ శివయ్య,వేముల రాజమ్మ, బండ మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Read also : స్కూల్ గేమ్స్ అండర్–14 రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌కు మందమర్రి విద్యార్థుల ఎంపిక





