
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-హైదరాబాద్ నగరం లో ప్రజలు శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ఐఎస్ సదన్ ప్రాంతంలో రౌడీషీటర్ నజీర్ వీరంగం సృష్టించడం ఆందోళనలకు కారణమైంది. సమాచారం ప్రకారం, నజీర్ స్థానిక నెహ్రూ నగర్ కాలనీలో గంజాయి మత్తులోకి వచ్చి బైక్‌పై వెళ్లే వారిపై పదునైన కత్తితో దాడులు చేశాడు.
వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు, మార్గంలో కనిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు.
నజీర్‌పై ఇంతకుముందు కూడా బంగారం, బ్యాగులు, మొబైల్స్ దొంగతనం, మ్యాచింగ్ కేసులు వంటి అనేక నేరాలలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని క్రిమినల్ రికార్డును పరిగణనలోకి తీసుకుని, అతడిని రౌడీషీటర్‌గా ఓపెన్ చేశారు. ఈ ఘటనతో ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే, నజీర్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read also : యాదాద్రి కాంగ్రెస్ జడ్పీ చైర్మెన్ గా పాక మంజుల మల్లేష్ యాదవ్?
Read also : ఒక్కో ఏడాది.. ఒక్కో మూవీ పాపులర్?