
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జిల్లా వర్గ సభ్యులు గురుజ రామచంద్రం అన్నారు. సీపీఐ మునుగోడు సమితి ఆధ్వర్యంలో మునుగోడు అంబేద్కర్ సెంటర్లో సురవరం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజరామచంద్రం మాట్లాడుతూ… సురవరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది నిమిషాలకే తమ ఆత్మీయ నేత సురవరం మరణించిన వార్త తెలియడంతో సిపిఐ నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు.
Read also : ఇండియాకు రానున్న ది గ్రేట్ ఫుట్ బాల్ ప్లేయర్?
సురవరం సుధాకర్‌రెడ్డి 1942, మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్‌రామ్‌రెడ్డి. తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి స్వయాన సుధాకర్‌రెడ్డికి పెదనాన్న అవుతారనీ గుర్తుకు తెచ్చారు. ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్, వైఎఫ్ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తరువాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు. సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వ్యక్తి. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్ గా కీర్తి గడించారన్నారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన తదుపరి 2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. పుదుచ్చేరి (2015), కొల్లాం(2018) మహాసభలో తిరిగి ఎన్నుకోబడిన సుధాకరరెడ్డి 2019 జులై 24న పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆరోగ్య కారణాలతో రిలీవ్ అయ్యారన్నారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీపీఐ పార్టీ తరపున తెలియజేస్తున్నామన్నారు. సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, గోస్కొండ లింగయ్య ,ఏం పండు దయాకర్ వనo వెంకన్న,బెల్లం శివయ్య, కట్కూరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read also : వర్షాలు తగ్గుముఖం… శాంతిస్తున్న కృష్ణ, గోదావరి నదులు!