ప్రజావాణిలో పిర్యాదులు బుట్ట దాఖలు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

మియాపూర్, క్రైమ్ మిర్రర్ :-మియాపూర్ సర్కిల్ లో ప్రజావాణిలో మీయాపూర్ మక్త మహబూబ్పేట్ 44 సర్వేనెంబర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా అనేక అక్రమ నిర్మాణాలపై 5 సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేసిన బిల్డింగులను సీజింగ్ బోర్డులు తొలగించి నిర్మాణాలు చేపడుతుంటే జి హెచ్ ఎం సి అధికారులు వారి దగ్గర మామూళ్లు తీసుకొని వదిలేస్తుండడంతో ఏలాంటి భయం లేకుండా సీజింగ్ బోర్డు తొలగించి యెదేచ్ఛగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా జిహెచ్ఎంసి అధికారులే దగ్గర ఉండి చేయించే విధంగా వ్యవహరిస్తున్నారు. మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చిన జిహెచ్ఎంసి అధికారులు వాటన్నింటినీ పక్కనపెట్టి జిహెచ్ఎంసి అధికారులే బిల్డర్లకు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకోమని సలహా ఇస్తూ వారిచ్చే డబ్బులకు దాసోహం అంటూ ప్రజల కోసం కాదు బిల్డర్ల కోసమే పని చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న జిహెచ్ఎంసి అధికారుల, సిబ్బంది తీరును తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేయకుండా వారందరి పైన క్రిమినల్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనుమతులు లేని అక్రమ నిర్మాణాలకు మేము ఇచ్చిన కంప్లైంట్ పై కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వారికి అండగా ఉండి జిహెచ్ఎంసి అధికారులే సలహాలు ఇవ్వడాన్ని మేము ఇచ్చిన నోటీసులు వారికి చూపెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నా అధికారులపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు వీరిపైన ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపి,మియాపూర్ సర్కిల్ 48, ఏసీపి కి ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి సీజింగ్ చేసిన బిల్డింగ్లను కన్స్ట్రక్షన్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏ అనుమతులు లేకుండా కట్టే మిగతా బిల్డింగ్లను కూడా ఎక్కడికక్కడ సీజ్ చేయవలసిందిగా కోరుతూ ప్రజలకు జిహెచ్ఎంసి అధికారులపై నమ్మకం కుదిరే విధంగా చూడాలని మనవి చేస్తున్నాను. దయచేసి పేద, మధ్య తరగతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను 44 సర్వే నెంబర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కట్టే బిల్డింగులలో ఎవరు కొనకూడదని కొన్నవారు ఇబ్బందులు పడతారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తౌటిరెడ్డి సంతోష్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button