
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
ప్రస్తుత రోజుల్లో టైమింగ్ పాటించలేదు అని, సరైన సమయానికి కంపెనీలో అడుగు పెట్టలేదు అని ఉద్యోగులను తీసేసిన సందర్భాలు ఎన్నో చూసాము. కానీ మొట్టమొదటిసారిగా ఆఫీసుకు ముందుగా వస్తుంది అని ఆ ఉద్యోగిని ఉద్యోగంలో నుంచి పీకేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే స్పెయిన్ దేశానికి చెందిన 22 ఏళ్ల యువతి తను పనిచేసే కంపెనీకి ప్రతిరోజు కూడా 40 నిమిషాల ముందుగా వచ్చేది. ఇది గమనించిన తోటి ఉద్యోగులు మేనేజర్‌కు తెలియజేయగా ఆ మేనేజర్ యువతిని పలుమార్లు సరైన సమయానికి వస్తే సరిపోతుంది అని సూచించారు. అయినా కూడా వినకుండా ప్రతిరోజు అరగంట ముందుగానే ఆఫీసులో అడుగు పెట్టడంతో అప్పటికే 20 సార్లు చెప్పి చెప్పి చివరికి విసుకు చెంది ఆ ఉద్యోగిని కంపెనీ మేనేజర్ తొలగించారు. నీవల్ల తోటి ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు అని.. అదే ఎందుకు అర్థంచేసుకోవడం లేదు అని తొలగించారు. అయితే ఈ విషయంపై ఆ యువతీ అత్యున్నత స్థాయి కోర్టును ఆశ్రయించినా కానీ… చివరికి ఫలితం దక్క లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఇలా చేసినా కూడా ఉద్యోగాలు పీకేస్తారా అని అవాక్కవుతున్నారు.
Read also : IPL-2026 మినీవేలం తొలిసెట్ జాబితా విడుదల.. లిస్టులో భారీ ధర పలికే ఆటగాళ్లు!
Read also : నిద్రలో చూసుకోకుండా పసికందుపై ఒరిగిన తల్లి.. ఊపిరాడక చిన్నారి మృతి!





