
నూతనకల్, (క్రైమ్ మిర్రర్) : మండల పరిధిలోని ఎర్రపహడ్ ఐకేపీ ధాన్యం సెంటర్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గురువారం పరిశీలించారు.ధాన్యం కంటాల వివరాలు,బుక్స్ వెరిఫికేషన్ ట్యాబు ఎంట్రీ సెంటర్ లో కాంటాలు కావలసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఏపీఎం రమణాకర్ వివరిస్తూ మండలంలో సుమారుగా 30 వేల క్వింటల ధాన్యం కాంటాలు కావలసి ఉన్నదని తెలిపారు.లారీలు త్వరగా
అన్లోడ్ కావటం లేదని తెలుపగా హుజుర్నగర్ ఆర్ఐ తో మాట్లాడి త్వరగా దిగుమతి చేయించాలని లారీలు త్వరగా పంపించాలని, నూతనకల్ మండలం కు అదనంగా 10 లారీలను పంపించాలని సివిల్ సప్లై డీసీఎం ను ఆదేశించించారు.అనంతరం
కాంట వేసిన బస్తాలను పరిశీలించి పూర్తి నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యం ను కొనుగోలు చేయాలని ఈ నెల 20 వ తారీకు వరకు సాధ్యమైనంత వరకు కాంటలు పూర్తి చేయాలనీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఎం సివిల్ సప్లై ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస రావు, ఎంపీడీవో సునీత, ఏపివో శ్రీరాములు, ఏవో మురళి, ఏఇవో, సీసీ ముత్తయ్య, సరస్వతి, బండపెల్లి గీత, ట్యాబు ఆపరేటర్, పద్మ, లింగాల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.