Tuesday, February 24, 2026
Homeతెలంగాణమిర్యాలగూడలో నాగుపాముల కలకలం..!

మిర్యాలగూడలో నాగుపాముల కలకలం..!

క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: అడవిలో ఉండాల్సిన ప్రమందకర నాగు పాములు ఒక్కసారిగా ప్రజలు నివసించే ఇంట్లో దర్శనం ఇస్తే చుసిన వారి గుండెలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అలాంటి ఘటనే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్‌లో నాగుపాము కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ 17వ వార్డులో నివాసం ఉంటున్న పానుగోత్ సైదా నాయక్ ఇంట్లో ప్రమాదకరమైన నాగుపాము కనిపించింది. వెంటనే విషయం తెలుసుకున్నస్థానికులు వార్డు మాజీ కౌన్సిలర్ లావూరి రవి నాయక్, కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి లకు సమాచారం అందించారు.

దింతో వెంటనే స్పందించిన వారు వార్డు ప్రజల భద్రత దృష్ట్యా స్నేక్ క్యాచర్‌ను పిలిపించి పామును సురక్షితంగా పట్టించారు. సందర్బంగా వారు మాట్లాడుతూఇలా పాములు కనిపిస్తే వాటిని చంపకుండా స్నేక్ క్యాచర్‌ లకు సమాచారం అందిస్తే వారు వాటిని పట్టుకొని సురక్షిత ప్రదేశం లో వదిలేస్తారు.

కావున ఇంటి చుట్టూ పరిసర ప్రదేశం చెత్త, చెదారం లేకుండా చూసుకుంటే ఎలాంటి ప్రమాదకర జీవులు దరి చేరవు అన్నారు.అనంతరం సకాలంలో స్పందించి ప్రమాదాన్ని తప్పించిన కౌన్సిలర్ లు రవి నాయక్, నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి లకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments