ఆంధ్ర ప్రదేశ్

డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేసిన ఏపీ ప్రభుత్వం!.. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా యాప్ ప్రారంభం?

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ అభివృద్ధి బాటలో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కొన్ని వందల సర్వీసులను ప్రజల ఇంటికే చేర్చి శభాష్ అనిపించుకుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఇళ్లలోనే ఉండి ఎన్నో ప్రభుత్వ సర్వీసులను సులభంగా పొందేలా ఏర్పాటు చేసింది . అచ్చం అలానే డ్వాక్రా రుణాలు మరియు పొదుపు చెల్లింపునకు ఒక ప్రత్యేకమైన యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. డ్వాక్రా రుణ వాయిదాలు చెల్లింపునకు ప్రతి నెల కూడా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతూనే టైంను వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ సమస్యలను ఎలాగైనా తీర్చే విధంగా ప్రభుత్వం ఒక యాప్ను తీసుకువచ్చే ఆలోచనలో పడిందని సమాచారం అందింది. ఈ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చాలా సులభంగా… రుణాల చెల్లింపులను సులభతరం చేయబోతుంది.

ఈ ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా….
1. రుణాల చెల్లింపు ఇబ్బందులు
2. అవకతవకలను నిరోధించడం
3. డ్వాక్రా మహిళలకు పెద్ద సంఖ్యలో రుణాలు ఇవ్వడం.
4. ఆర్థిక మరియు డిజిటల్ విషయాలపై శిక్షణ

వంటివి చాలా సులభతరంగా చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల నుంచి దాదాపు 1.25 లక్షల మంది సభ్యులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి లోన్ ప్లాన్ రూపొందించనుంది. వీరికి ప్రత్యేకంగా ఆర్థిక విషయాలు అలాగే ఇతర డిజిటల్ విషయాలపై శిక్షణ కూడా అందించనున్నారు. ఇక వచ్చే ఏడాది కల్లా 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 61 వేల 964 కోట్ల రుణాలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డ్వాక్రా మహిళలు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది.

యుద్ధమే జరిగితే… పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే దేశాలు ఇవే!..

అమరావతి సభకు గైర్హాజరైన చిరంజీవి… అసలు కారణం ఇదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button