
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ఎంతలా ప్రసిద్ధి చెందాయో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి CMR షాపింగ్ మాల్స్, చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడైనటువంటి చందన మోహన్ రావు ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మోహన్ రావు ఇవాళ ఉదయం మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ మన రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలలో విస్తరించి ఉన్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలు, ఫర్నిచర్స్, జువెలరీ, నిత్యవసర సరుకులు ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వస్తువులను ఒక చోటే ప్రజలకు అందిస్తున్నారు. చిన్న వ్యాపారిగా మొదలుపెట్టి ఆయన కృషి, పట్టుదలతోనే నేడు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్స్ బ్రాండ్ మాల్స్ గా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వ్యాపారంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మోహన్ రావు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే నాణ్యమైన వస్త్రాలతో పాటు వస్తువులను అందించారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇతని వ్యాపారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఇతని మృతి పట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రిటైల్ రంగానికి ఇతను చేసినటువంటి సేవలు అభినందనీయం. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఇతనిని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మోహన్ రావు మృతి చెందినప్పటికీ కూడా ఆయన సృష్టించినటువంటి బ్రాండ్లు, విలువలు, వ్యాపార మార్గాలు ఎప్పటికీ కూడా భూమ్మీద నిలిచిపోతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చందన మోహన్ రావు అనే పేరు తెలుగు రాష్ట్రాల వ్యాపార చరిత్రలో ఒక స్వర్ణాక్షరంగ నిలిచిపోనుంది
Read also : భోజనానికి సరిపడా డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం : సమంత
Read also : కాంగ్రెస్ కు మొదటి ఎదురుదెబ్బ జూబ్లీహిల్స్ లోనే జరుగుతుంది : కేటీఆర్