క్రైమ్తెలంగాణ

సీఎం రేవంత్‌తో తేల్చుకుంటా.. తొడగొట్టిన హీరో నాగార్జున!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైడ్రా ఆపరేషన్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. హైడ్రా కూల్చివేతలను సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్ధిస్తుండగా విపక్షాలు మాత్రం హైడ్రాతో హైడ్రామా చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు సాగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇక టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై భిన్న వాదనలు వస్తున్నాయి. చెరువులో కట్టిన కట్టడాన్ని కూల్చివేసి రేవంత్ రెడ్డి రియల్ హీరోగా నిలిచారని సీపీఐ నారాయణ ప్రశంసించారు. అక్రమంగా కట్టిన కన్వెన్షన్ ద్వారా గత పదేళ్లలో నాగార్జున సంపాదించినంతగా వసూల్ చేయాలని డిమాండ్ చేశారు. మరికొందరు మాత్రం నగరంలో లక్షలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయని.. కావాలనే నాగార్జునను టార్గెట్ చేశారని ఆరోపించారు. అయినా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు.

తాను తుమ్మిడికుంటలో ఎలాంటి భూమి కబ్జా చేయలేదని ప్రకటించిన హీరో నాగార్జున మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను సెంట్ భూమి కూడా కబ్జా చేయలేదంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పట్టాభూమిలోనే కన్వెన్షన్ కట్టానని తెలిపారు. కోర్టులోనే తేల్చుకుంటానని.. తనకు జరుగుతున్న అసత్య ప్రచారంలో నిజం లేదన్నారు. రేవంత్ సర్కార్ తో తేల్చుకుంటాననే ధోరణిలో ఆయన తాజా ప్రకటన చేశారు.

Read More : సచివాలయం, నెక్లెస్‌రోడ్డును కూల్చేస్తారా! హైడ్రాకు అసద్ వార్నింగ్ – Crime Mirror

  • నాగార్జున చేసిన తాజా ప్రకటనలో ఏముందంటే..

ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,

N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం
గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను

మీ,
అక్కినేని నాగార్జున

Back to top button