
-
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను… బీజేపీని గెలిపిస్తా
-
నోబెల్ కాదు… గోబెల్స్ ప్రచారం ప్రైజ్ ఇవ్వొచ్చు
-
దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలనడం సంతోషమే
-
పొన్నం ప్రభాకర్, మహేష్‌కుమార్‌లో ఒకరిని సీఎంగా చేయాలి
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, బీజేపీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో హైడ్రా ఇండ్లు కూల్చినట్లే… కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోనుందని రామచంద్రరావు జోస్యం చెప్పారు. హైడ్రాకు ఫాతిమా కాలేజీ కన్పించకపోవడం శోచనీయమన్నారు రామచంద్రరావు.
రేవంత్‌కు భాస్కర్ అవార్డ్ కరెక్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విలేకరులతో చిట్‌చాట్ మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డ్ సరైనదని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్‌కు నోబెల్ కాదు… గోబెల్స్ ప్రచారం బహుమతి ఇవ్వొచ్చని హితవు పలికారు. అలాగే, దత్తాత్రేయను రాష్ట్రపతి చేయాలన్న రేవంత్ సూచనను స్వాగతిస్తున్నామన్న రామచంద్రరావు… తెలంగాణ సీఎంగా పొన్నం ప్రభాకర్ లేదా మహేష్ కుమార్‌గౌడ్‌ను నియమిస్తే బాగుంటుందని అన్నారు.
Read Also: