కేటీఆర్ పై నమోదైన ఫార్మూలా కార్ ఈ రేస్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారని.. ఆయన్ను ఎవరూ కాపాడలేరని చెప్పారు. హెచ్.ఏం.డి.ఏ ఖాతాలో ఉన్న ప్రభుత్వ సొమ్మును విదేశీ సంస్థకు ఎట్లా తరలిస్తారని అన్నారు. అగ్రిమెంట్ చేసుకున్నది 600 కోట్లకని.. ప్రభుత్వం సొమ్ము స్వంత వాళ్లకు ఇవ్వడానికి లేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ ప్రతినిధి తనను కలిశారని.. అందులో ఎలాంటి సీక్రెట్ లేదని చెప్పారు. వేల కోట్లు నష్టం వచ్చిందని ఫార్ములా ఈ కార్ రేస్ ప్రతినిధి నష్ట పరిహారం ఇవ్వాలని లండన్ లో కేసు వేశారని.. అయితే
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ ఒప్పందం రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.
ఫార్ములా ఈ రేస్ ముగ్గురి మధ్య ఒప్పందం జరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ చేయాలంటే కేంద్రం నుండి 18 రకాల అనుమతులు తీసుకోవాలన్నారు. ఎఫ్ఈఓ, గ్రీన్ కో మధ్య వివాదం జరిగిందని.. ట్రై పార్టీ అగ్రిమెంట్ ను బై పార్టీ అగ్రిమెంట్ గా కేటీఆర్ మార్చారని వెల్లడించారు. యూకే అకౌంట్ కు రెండు విడతలుగా బదిలీ చేశారని.. కాని ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వం పధకాలు ఆగిపోతాయన్నారు. అయినా 55 కోట్లు హెచ్.ఎం.డి.ఏ ఖాతా నుండి ఎన్నికల కోడ్సమయంలో బోర్డు అప్రూవల్ లేకుండా ట్రాన్స్ఫర్ చేశారని సీఎం తెలిపారు. 10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలన్నారు.
గ్రీన్ కో,కేటీఆర్ కుమ్మక్కు అయ్యి స్పాన్సర్ షిప్ రద్దు చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్ రూల్స్ కు విరుద్ధంగా డబ్బులు పంపారని.. పౌండ్స్ కొని ఆర్.బి.ఐ అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేశారని వెల్లడించారు. ఫార్ములా ఈ రేస్ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టగానే లండన్ లో పెట్టిన కేసును విత్ డ్రా చేశారని తెలిపారు.ప్రజాప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే పీసీ యాక్ట్ కింద కేసు పెట్టవచ్చని..
గ్రీన్ కో కంపెనీని తప్పించి 600 కోట్లు ప్రభుత్వంపై భారం పడే విధంగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ రేస్ ద్వారా హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందని అనేది ఊహాజనితమే అన్నారు.