తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్నారా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలతో అవుననే అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గురువారం జరిగిన సమావేశం చూసిన వాళ్లంతా జగన్ ను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ ప్రముఖులను గంట సేపు వెయిట్ చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం
10 గంటలకి మీటింగ్ అని చెప్పి 11 గంటలకు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
10 గంటలకు మీటింగ్ కావడంతో 9-30 నుంచే టాలీవుడ్ స్టార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చారు. అగ్రహీరోలు వెంకటేష్, నాగార్జునలు కూడా ముందే వచ్చారు. మీటింగ్ హాల్ లో 10 గంటలకే అందరు కూర్చున్నారు. కాని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 11 గంటలకు వచ్చారు. కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట ఆలస్యంగా వచ్చారని.. టాలీవుడ్ పెద్దలను వెయిట్ చేయించాలని అలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ను కలవడానికి టాలీవుడ్ ప్రముఖులంతా అమరావతి వెళ్లారు. అయితే చిరంజీవి సహా టాప్ హీరోలను జగన్మోహన్ రెడ్డి.. దాదాపు 2 గంటలు వెయిట్ చేయించారనే వార్తలు వచ్చాయి. జగన్ తీరుపై కొందరు స్టార్లు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా సేమ్ జగన్ లానే టాలీవుడ్ హీరోలను గంట సేపు వేయిట్ చేయించారని అంటున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏదో ఒక అంశంలో ఇరికిస్తూ, ఇరకాటంలో పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన ఈగోతో ఇండస్ట్రీ వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ.సంధ్య థియేటర్ ఘటన విచారకరం కానీ ఆ సంఘటనలో అల్లు అర్జున్ టార్గెట్ గా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చ దేశ వ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇండస్ట్రీ ప్రముఖులను తన దగ్గరికి రప్పించుకున్న తీరుతో అందరిలో ఒక క్లారిటీ వచ్చేసింది.ఇలా రేవంత్ కాళ్ళ దగ్గరకే ఇండస్ట్రీ ప్రముఖులను రప్పించుకోడానికే అల్లు అర్జున్ సంఘటనను వాడుకున్నారు అనేలా ఈ మీటింగ్ వెంట వెంటనే జరగడం దానికి సంకేతం.