క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మెుదలైంది. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశానికి మన్మోహన్ సింగ్ విశేష సేవలు అందించారని రేవంత్ కొనియాడారు. ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీపడేలా దేశాన్ని తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వేసిన పునాదుల వల్లే నేడు ప్రపంచంతో భారత్ పోటీ పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also : తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును మన్మోహన్ పాస్ చేయించారని, ఇందుకు తెలంగాణ ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాది, రాష్ట్రానికి ఆత్మబంధువు మన్మోహన్ సింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారతరత్న ఇచ్చి మన్మోహన్‌ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో మన్మోహన్‌ను విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. మాజీ ప్రధాని విగ్రహం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :