హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తమిళనాడు ఎన్నికలు క్రమంగా హీటెక్కిస్తున్నాయి. తమిళనాడులో ప్రచారం కోసం కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్కటించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి లనూ చేర్చింది.
కాగా..తమిళనాడులో తెలుగువారి సంఖ్య ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదిలా ఉంటే తమిళనాడులో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుండగా..అందులో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్ పరిశీలకుడిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది.
