
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తాజాగా సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 42 మంది చనిపోగా అందులో ఏకంగా 10 మంది మన హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మక్కాలోని ప్రార్థనలను ముగించుకుని మదీనాకు వెళ్తున్నటువంటి బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల వ్యాప్తికి 42 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. అందులోనూ దాదాపు 20 మంది మహిళలు అలాగే 11 మంది పిల్లలు ఉండడం గమనార్హం. చనిపోయిన 42 మంది వ్యక్తులలో హైదరాబాద్ వాసులు పదిమంది ఉన్నారని నేషనల్ మీడియా తెలిపింది. ఇక ఈ ఘటనపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ మృతి చెందిన పదిమంది హైదరాబాద్ వాసులకు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం రెండు నెంబర్లను సూచించారు. 7997959754 మరియు 99129 19545 నెంబర్లకు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు అని తెలిపారు.
Read also : తప్పు అయ్యింది… నన్ను క్షమించండి : CV ఆనంద్
Read also : రవితేజ – సమంత కాంబినేషన్ లో సినిమా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!





